శ్రీకాళహస్తి శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం శాస్త్ర యుక్తంగా కన్నుల పండుగ జరిపారు. సుదర్శన చక్ర ధ్వజ పతాకాన్ని అధిరోహించారు. గోవింద నామ స్మరణ ల తో భక్తులు ద్వజారోహణం తిలకించి భక్తి పార్వస్యంతో పరవశించారు. ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామి ఉత్సవాలు వైభోపీతంగా నిర్వహిస్తామని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు. అన్నారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో శాస్త్ర యుక్తంగా ప్రారంభమయ్యాయి. ధర్మరాజుల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ . ఆధ్వర్యంలో ధ్వజస్తంభం వద్ద ద్రౌపతి సమేత ధర్మరాజుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాచరణలు తో హోమ పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ సుదర్శన చక్ర ధ్వజపతాకాన్ని ధ్వజస్తంభం పైకి అధిరోహింప చేశారు. ధ్వజారోహణం ను వేదోయుక్తంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం ఈవో సాగర్ బాబు ,ఎమ్మెల్యే సతీమణి వాణిమ్మ ధ్వజ పతాకం తో పాటు భక్తుల సమర్పించిన చీరలను ధ్వజస్తంభం పైకి అధిరోహింపజేశారు. భక్తులు గోవింద నామ స్మరణ నడుమ ద్వాజారోహణం కనులు పండుగ జరిగింది. ధ్వజస్తంభానికి అభిషేకాలు చేసి విశేష పూజలు చేసి హారతులు సమర్పించారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు. మాట్లాడుతూ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల ను అంగరంగ వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ధర్మసత్య నిష్ఠులకు ప్రతీకైనా ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరుపుతున్నామన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో ఈ ఏడాది కంకణాలు కూడా భక్తులు ఉచితంగా ఇచ్చామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు, పాలక మండలి సభ్యులు కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి పాండు, శ్రీదేవి, దేవస్థాన అధికారులు డిప్యూటీ ఈవో జే వెంకటసుబ్బయ్య, ఏఈఓ లోకేష్ రెడ్డి,టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం,దేవస్థాన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, దేవస్థానం సిబ్బంది పిఆర్ఓ వెంకట్ స్వామి, వేద పండితులు అర్థగిరి, రాజేష్ శర్మ, పట్టణ ప్రముఖులు భాస్కర్ ముదిరాజ్, లక్ష్మీపతి, జూలకంటి మురళి మరియు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment