పెద్దలు పనికి పిల్లలు బడికి పరిపాలన అధికారి ప్రతాపరెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, June 16, 2023

పెద్దలు పనికి పిల్లలు బడికి పరిపాలన అధికారి ప్రతాపరెడ్డి

 పెద్దలు పనికి పిల్లలు బడికి పోవాలని పిలుపునిచ్చిన కేవీపీ పురం మండలం పరిపాలన అధికారి ప్రతాపరెడ్డి




స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


బాల కార్మికుల నిర్మూలన మాసత్సవాలు భాగంగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు ఈరోజు కేవీపీ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బాల కార్మికుల నిర్మూలన చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నాకు ముఖ్యఅతిథిగా కె.వి.పురం మండల కార్యాలయ పరిపాలన అధికారి ప్రతాప్ రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకట కృష్ణయ్య, కె.వి.పురం సచివాలయ సిబ్బంది మరియు పోలీస్ అధికారులు ,కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీ  పాల్గొన్నారు.

అనంతరం బాల కార్మికుల నిర్మూలనపై ర్యాలీ మరియు దుకాణాల యజమానులకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు


అధికారులు మాట్లాడుతూ.... బడి ఈడు పిల్లలు బడికే వెళ్లాలని పనికి వెళ్ళకూడదు అని తెలిపారు. పెద్దలు పనికి వెళ్లాలి పిల్లలు బడికి వెళ్లాలని తెలిపారు. అలాగే బాల కార్మికులను పనిలో పెట్టకూడదని తెలిపారు. మరియు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం గురించి వివరించారు. బాల కార్మికులు ఎక్కడైనా మీ దృష్టికి వచ్చిన దగ్గర్లో ఉన్న పోలీసులు కానీ లేదా గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారికి తెలిపినచో సంబంధిత అధికారులు పంపిస్తారని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad