అక్షరాభ్యాసం సందర్భంగా పుస్తక సామాగ్రి ని దేవస్థానం కు అందజేత
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో అక్షరాభ్యాసం సందర్భంగా పలకలు బలపములు మరియు పుస్తక సామాగ్రి ని దేవస్థానం కు అందజేసినారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాభ్యాసం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం వాస్తవ్యులు ఐఓసీఎల్ డీలర్స్ బిజినపల్లి సుజలక్ష్మి మరియు బిజినపల్లి ముని మహేష్ బాబు మరియు కుటుంబ సభ్యులు కలిసి దేవస్థానం కు సుమారు 70000 రూపాయల విలువతో కూడిన పలకలు బలపములు మరియు పుస్తక సామాగ్రి ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారి సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని దానాలు కన్నా విద్యా దానం చాలా గొప్పదని తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బిజినపల్లి ముని మహేష్ బాబు గారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో అక్షరాభ్యాసం సందర్భంగా పలకలు బలపములు మరియు పుస్తక సామాగ్రి ని దేవస్థానంకి అందజేశారు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాను. అనంతరం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపర్డెంట్ శ్రీహరి,ధర్మకర్త మండలి సభ్యురాలు రమాప్రభ, పట్టణ ప్రముఖులు భాస్కర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment