అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి విద్యా కానుక
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి విద్యా కానుకలో భాగంగా కిట్లు పంపిణీ అందించాం అని తెలిపిన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక లో భాగంగా విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమం శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ స్కూల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మరియు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పై కార్యక్రమంను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంను లైవ్ టెలికాస్ట్ చేసి విద్యార్థులకు చూపించారు. అనంతరం విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయడం జరిగింది.
చైర్మన్ ఆర్కాట్ శంకర్ మాట్లాడుతూ.... గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసుధన్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించుకొని జగనన్న విద్యా కానుక లో భాగంగా కిట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల ఉపయోగించుకొని బాగా చదువుకొని భావి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు.
No comments:
Post a Comment