ముత్యాలమ్మ కళ్యాణ మండపం ఆధునికత పనులను పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ కళ్యాణమండపం సుమారు 34 లక్షలతో ఆధునికత పనులను పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఇంజనీరింగ్ శాఖ సిబ్బందితో కలిసి పనులను పరిశీలించి ఇంజనీరింగ్ శాఖ అధికారులు తగు సూచనలను అందించారు.
ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ కళ్యాణమండపం సుమారు 34 లక్షలతో ఆధునికత పనులను పరిశీలించిన జరిగింది. గతంలో 2003 లో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ మండపం పూర్తిగా ఆధునికతతో విట్రిఫైడ్ టైల్స్, గ్రైనేట్ తో, స్టెయిన్లెస్ స్టీల్ గర్ల్స్ ఏర్పాటు చేసి, మరియు కళ్యాణ మండపంలో ఏసీ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కళ్యాణ మండపం పనులను 45 రోజుల్లో పూర్తి చేసి పట్టణ ప్రజలులో మధ్యతరగతి కుటుంబ సభ్యులు అందుబాటు తీసుకొస్తామని అన్నారు. ఈ పాలకమండలి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరపాలని క్షుణ్ణంగా పరిశీలించి. మా యొక్క శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి శ్రీకారం చూస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ పవన్ కుమార్, చైర్మన్ పిఎ పసుపులేటి కామేశ్వరరావు, కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డి మరియు పట్టణ ప్రముఖులు పీఎం చంద్ర, వేలూరు రమేష్, ఆలయ పూజారి పరమేశ్వర్ మరియు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment