పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దాత సహకారంతో పున్న నిర్మాణం చేపట్టిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయం పురాతనమైన దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయను శ్రీకాళహస్తి పట్టణం జయరాం రావు వీధి వాస్తవ్యులు రిటైర్డ్ ఎస్బిఐ ఆఫీసర్ శ్రీనివాసులు సొంత నిధులతో దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయముకు వేద పండితులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయమును శ్రీకాళహస్తి పట్టణం జయరాం రావు ఇది చెందిన రిటైర్డ్ ఎస్బిఐ ఆఫీసర్ శ్రీనివాసులు తన సొంత నిధులతో దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను నూతన దేవాలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అంతేకాకుండా గతంలో కూడా శ్రీనివాసులు దేవస్థానం నిత్య అన్నదానానికి ఐదు లక్షల విరాళం కూడా అందజేశారని తెలియజేశారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ వేణుగోపాల్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ, వేద పండితులు అర్థగిరి శర్మ, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, కాంట్రాక్టర్ ఆర్కార్డు ముత్తు, కార్తీక్, హేమంత్, మరియు పట్టణ ప్రముఖులు ధన, కళ్యాణ్, తేజ, మరియు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment