శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, June 14, 2023

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు







స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో  శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద  సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు, దేవస్థాన అధికారులు ప్రధానఅర్చకులు పాల్గొన్నారు.

ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర  దివ్య క్షేత్రంలో ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం ప్రారంభమైంది. జన్మనిచ్చిన  తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతి ఓడిలోకి          పయనించ్చే ప్రయాణం భాగంలోనే ఈ అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం సవ్యంగా జరిగితే ఆ పిల్లలు యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు యొక్క ఆలోచన భాగంలోని పిల్లలందరి చేత ఓం నమశ్శివాయ సిద్దాయనమః అనుకుంటూ అక్షరాభ్యాసం ప్రారంభం అయింది.అక్షరాభ్యాసం చేసిన పిల్లలందరికీ తల్లి జ్ఞానప్రసూనాంబికా దేవి సమేత  శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెన ఉంటుందని తెలిపారు. పిల్లలందరూ అద్భుతంగా చదువులన్నీ పూర్తి చేయాలని ఆ తల్లి ఆ యొక్క శక్తిని ఇస్తుందని అన్నారు. తల్లి జ్ఞాన ప్రసూనాంబిక అంటే జ్ఞానాన్ని అందించే తల్లి జ్ఞాన ప్రసూనాంబిక ఆ తల్లి ఒడిలోనే అక్షరాభ్యాసం జరిగింది ఆ యొక్క పిల్లలందరూ కూడా మంచి చదువులు ఇస్తుందని తెలియజేశారు. పిల్లలకు తల్లిదండ్రులు కూడా పిల్లల పైన శ్రద్ధ చూపించి నేను చదువు చదివితేనే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అదేవిధంగా పిల్లలకి చదువే మంచి ఆస్తి తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, పాలకమండలి సభ్యులు కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు శ్రీదేవి మరియు దేవస్థాన అధికారులు డిప్యూటీ ఈవో జే వెంకటసుబ్బయ్య  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరత్నం,ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి గారు ఆలయ అనుబంధ ఆలయాల సూపరిండెంట్ శ్రీహరి  ఆలయ తనిఖీదారులు ఆలయ పర్యవేక్షకులు ఆల ఏఈఓ సతీష్ మల్లి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దఫిదర్, దాము, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, అభిషేక గురుకుల్ స్థానం సురేష్ గురుకుల్, వెద పండితులు, అర్ధగిరి, రాజేష్ శర్మ, విష్ణుభట్ల, శ్రీనివాస శర్మ, దేవస్థాన సిబ్బంది, చైర్మన్ సిసి, సుదర్శన్ రెడ్డి, పసుపులేటి కామేశ్వరరావు మరియు పట్టణ ప్రముఖులు తదితరులు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad