స్థానికుల కొరియోగ్రాఫర్లకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సంస్కృతి కార్యక్రమంలో తొలి ప్రధానిత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారిని మర్యాదపూర్వ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం నూతనంగా ఏర్పడిన కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులుకి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శేష వస్త్రంతోసత్కరించి స్వామి అమ్మ వార్ల చిత్రపటాన్ని బహుకరించారు.
ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంస్కృత కార్యక్రమంలో తొలి ప్రాధాన్యత శ్రీకాళహస్తి పట్టణంలో డాన్స్ అకాడమీ వారికి వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా రామసేతు వంతెన వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా మీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులతో ఆధ్వర్యంలో నృత్యం ప్రదర్శన ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తానని తెలియజేశారు.శ్రీకాళహస్తీశ్వర డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులందరికీ తల్లి జ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎ.పోలయ్య,ఉపాధ్యక్షుడు ఉమాపతి,సెక్రటరీ SK.
ముజీబ్.జాయింట్ సెక్రటరీ పి.వెంకటాచలం,కోశాధికారి ఎం.ఎస్.ఆషా
No comments:
Post a Comment