వరల్డ్ నో- టొబాకో డే సందర్బంగా అవగాహన ర్యాలీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
వరల్డ్ నో- టొబాకో డే సందర్బంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ జావీద్ , గజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో పట్టణం గజేంద్రనగర్ అవరణ లో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది. టొబాకో వాడకం వల్ల ఊపిరితిత్తుల లో క్యాన్సర్ రావడం ,శ్వాసకోశ వ్యాధులు రావడం ,దానివల్ల ప్రాణాంతకమైన పరిస్థితులు వచ్చి ఆఖరుకు ప్రాణాలు పోయే పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఈ పోగాకుని మగవారు బీడీలు ,సిగరెట్ల రూపంలో ఇంకా ఆడవాళ్లు తాంబూలంలో నమలడం వల్ల నోటి క్యాన్సర్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ అనర్ధాలు రాకుండా ఉండాలి అంటే అందరూ టొబాకో వాడడం ఆపాలి అని ప్రజలకు చూచించారు ఈ కార్యక్రమంలో ANMS మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment