వెండి కవచముకు సుమారు 80000 విరాళం అందించిన రివర్ ఫ్రంట్ ఎస్టేట్స్ సభ్యులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని బహుదురుపేట, తిట్టు కాడ వెలసిన శ్రీ శ్రీ శ్రీ నల్లగంగమ్మ అమ్మవారి దేవస్థానం నకు భక్తుల యొక్క విరాళాల తో వెండి కవచము చేయుటకు ఆలయ కమిటీ సభ్యులు సంకల్పించారు. దీనిలో భాగంగా ఈరోజు రివర్ ఫ్రంట్ ఎస్టేట్స్ వారి ఆధ్వర్యంలో ఎం సుబ్రహ్మణ్యం నాయుడు, కంటా వెంకటేశ్వర్లు, జి వెంకట్రామానాయుడు, విజయబాబు, చిలుకూరు సిద్దు నాయుడు, దొడ్డ నాగేశ్వరరావు, కోదండన్, సోమశేఖర్ , రుద్ర రాజు, చంద్రబాబు... మొదలైన వాళ్ళు దేవస్థానమునకు 80000 నగదు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కంటా రమేష్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు చైర్మన్ కంట రమేష్ మాట్లాడుతూ....వెండి కవచం కు ధన రూపేనా, వస్తురూపేనా విరాళాలు అందించండి... అమ్మవారి కృపాకటాక్షాలు పొందండి అని తెలిపినారు. అలాగే విరాళాలు అందించిన రివర్ ఫ్రంట్ ఎస్టేట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment