సన్నిధి వీధి నందు ప్రైమరీ స్కూల్ లో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి విద్యార్థులు కోసం మన రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమం ఈరోజు సన్నిధి వీధి నందు ప్రైమరీ స్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు విద్యార్థులకు పంపిణీ చేశారు.
దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్య తరగతి విద్యార్థులకు జగనన్న విద్యా కనుక కిట్లను పంపిణీ చేశారు. ఈరోజు స్థానిక సన్నిధి వీధి నందు ప్రైమరీ స్కూల్లో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలతో విద్యార్థులకు జగనన్న కానుక కిట్లను అందించడం జరిగింది అని తెలియజేశారు. ఈ యొక్క జగనన్న విద్య కానుక కిట్లలో నాణ్యత కలిగినవి పిల్లలకు స్కూల్ యూనిఫామ్, ఒక జత షూస్, పుస్తకాలు, పెన్స్ పెన్సిల్, స్కూల్ బ్యాగు రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులందరూ చక్కగా విద్య బోధనలను నేర్చుకుని రాబోయే కాలంలో ఒక ఇంజనీర్ గా డాక్టర్ గా అవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ విద్య బోధనలను నేర్పిస్తున్న ఉపాధ్యాయులు పిల్లలకి కార్పొరేటర్ పాఠశాలలు దీటుగా నాణ్యత కలిగిన విద్యాబోధనలో అందిస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ నాణ్యత కలిగిన పౌష్టికాహారాలతో కలిగిన భోజనం అందిస్తున్నామని తెలియజేశారు పిల్లలందరికీ తల్లి జ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెన ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రస్సన్న,ఉపాధ్యాయురాలు అరుణ, మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment