MGM హాస్పిటల్స్ వారి వైద్య శిబిరం విజయవంతం.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ మరియు ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆదివారం బహదూర్ పేట లో జరిగిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 150 మంది పాల్గొని వారికి అవసరమైన ఆరోగ్య సంబంధిత సలహాలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వివేక్ చైతన్య (గుండె వైద్య నిపుణులు ), డాక్టర్ దినేష్ (ఎముకల సంబంధిత వైద్య నిపుణులు ), డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు (చిన్న పిల్లల వైద్య నిపుణులు ), డాక్టర్ దిలీప్ (ఎమర్జెన్సీ మెడిసిన్ ), డాక్టర్ అర్చన (డెంటల్ ) గార్లు పాల్గొన్నారు. MGM హాస్పిటల్స్ తరుపున ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా పరీక్షలు కూడా ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మరియు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఇప్పటికే ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఈ ఉచిత వైద్య శిబిరం ప్రెస్ క్లబ్ వారి తో కలసి నిర్వహించామని రాబోయే రోజుల్లో కూడా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే MGM హాస్పిటల్స్ నందు 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో వుంటాయని, ఆరోగ్య శ్రీ సంబంధిత ప్రతి ఆరోగ్య వైద్య సేవలు మరియు అపరేషన్ లు MGM హాస్పిటల్స్ నందు ఉచితంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్, నల్లగంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కంఠ రమేష్ గార్లు మరియు ప్రెస్ క్లబ్ మెంబర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment