గంగమ్మ తల్లి అలంకార మండపానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మండపం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నాయకులకు ఆదేశాలు.
శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారం నడివీధి గంగమ్మకు ఎదురుగా ఉన్న స్థలంలో స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి గారు అలంకార మండపంకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.సుమారు 10 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే సహకారంతో ఈ మండపం ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మండపం పనులు త్వరగా పూర్తిచేసి అందించాలని స్థానిక నాయకులకు ఆయన సూచించారు.
అనంతరం ఎమ్మెల్యేను స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్లు, బొందారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రత్నం రెడ్డి, కృష్ణా రెడ్డి,ఆర్కాట్ శంకర్ ,భరత్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వెంకట ముని రెడ్డి, రవికుమార్, కంద స్వామి శెట్టి, లక్ష్మీపతి రెడ్డి, ఆర్కాట్ మురళి, ముత్తు, కృష్ణారెడ్డి, ముని కృష్ణారెడ్డి ట్రస్ట్ బోర్డు సభ్యులు మున్నా ,జయ శ్యామ్, ఏ. బాబు ,సురేష్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment