ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయి. ధర్మరాజుల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి పది రోజులు పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల్లో అగ్నిగుండ మహోత్సవం లో సుమారు 10 వేల మంది భక్తులు అగ్నిగుండం తొక్కి మొక్కులు చెల్లిస్తారు. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గురువారం పరిశీలన చేశారు. ఆలయంలో జరుగుతున్న వివిధ రకాల పనులను పరిశీలించి, ఇంజనీరింగ్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎక్కడ కూడా గత ఏడాదిలాగే తొక్కిసలాటకు తావు లేకుండా పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్సవాలు లో వాహన సేవలు టైం టు టైం జరిగేలా ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు.
దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలతో తమ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో రెండో ఏడాది ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అగ్నిగుండం తొక్కే భక్తులకు కంకణానికి వసూలు చేసే రుసుము పూర్తిగా ఉచితం అని తెలిపారు*. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు చింతామణి పాండు, దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ వేణుగోపాల్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ పట్టణ ప్రముఖులు భాస్కర్ ముదిరాజ్, పసల కుమారస్వామి, బాలశెట్టి నరసింహులు, ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment