ధర్మకర్తల మండలి సమావేశం లో 48 అంశాలకు అజెండా పై ఆమోదం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మకర్తల మండలి సమావేశం లో 48 అంశాలకు సంబంధించిన అజెండా పై చర్చించి ఆమోదించారు.
మండలి సమావేశం అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సలహాలు సూచనలతో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు కు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సువర్ణముఖి నదిని పవిత్రంగా ఉంచడానికి పట్టణ పరిధిలో నది లోనీ మురుగునీరు పైప్ లైన్ ద్వారా తరలించే పథకానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ప్రోటోకాల్ విఐపి లకు నిర్దిష్ట సమయంలో దర్శనం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక భక్తులకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అంతరాలయ దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు. త్వరలో అమలులోకి తీసుకొస్తామని స్థానిక భక్తులకు శుభవార్త చెప్పారు.ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అంతరాలయ దర్శనానికి 500 రూపాయలతో టికెట్ పెట్టనున్నట్లు వెల్లడించారు.ప్రధాన ఆలయంలో లీకేజీ నివారణకు సంబంధించి మూడు కోట్లతో లీకేజీ నివారణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని దాత సహకారంతో ఈ పనులు చేయనున్నట్లు తెలిపారు. కాశీ విశ్వనాథ స్వామి ఆలయ లీకేజీలు కూడా నివారించి ఆధునికరణ పనులు చేయనున్నట్లు తెలిపారు.రామసేతు వంతెన కొత్త బ్రిడ్జి మధ్య ఖాళీ స్థలంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తామని, ఏపీ సీడ్స్ సర్కిల్లో ధ్యానమూర్తి శివయ్య విగ్రహం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వాతావరణం పట్టణంలో కనిపించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఆదికాలంలో ఉన్న గురు దక్షిణామూర్తి బ్రహ్మోత్సవాల పునర్ధరణ చేయడంపై చర్చించినట్లు తెలిపారు.ఆలయంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ధర్మకర్తల మండలి అనుమతితో మాత్రమే చేయాలని తీర్మానించారు. ఇష్టానుసారం అంతర్గత బదిలీలతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు.ప్రముఖుల ఆశీర్వాదం కు ఇకపై ప్రత్యేకంగా ఆశీర్వాద మండపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్ లైట్లు ఏర్పాటు, ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కు వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పన తదితర అంశాలను ఆమోదం తెలిపినట్లు చెప్పారు. హరిత అభివృద్ధి పథకంలో ప్రస్తుతం పని చేస్తున్న వారి వయసు 50 ఏళ్ళు పైన పడటంతో వారు ప్రస్తుతం చేస్తున్న విధులుకే పరిమితం చేసి, మరో 25 మందిని హరిత అభివృద్ధి కోసం తీసుకోనున్నట్లు చెప్పారు. నిత్య అన్నదాన మండపం పైన మరో సెల్లార్ ఏర్పాటు చేసి ఒక విడుదల 1000 మందికి అన్నదానం చేసేలా చేస్తామన్నారు.విజ్ఞానగిరి వద్ద గణపతి మండపం నిర్మాణం విశాలంగా చేసి కళ్యాణోత్సవం తిలకించే విధంగా చేయనున్నట్లు తెలిపారు. స్థానిక కోనేరులో ఆహ్లాదకర వాతావరణం తీసుకురావడం పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్ పార్కింగ్, సెల్ఫోన్ కౌంటర్స్ సిబ్బందికి యూనిఫామ్ పెడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి నెప్పాల మండపం పునర్నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో ఆలయాన్ని అనుబంధ ఆలయాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామన్నారు.
ఈ సమావేశంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో సాగర్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, సాధన మున్నా రాయల్,బుల్లెట్ జయశ్యామ్, కొండూరు సునీత, పసల సుమతి, రమాప్రభ, లక్ష్మి, మహీధర్ రెడ్డి, పెద్దిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, దాసరి జయమ్మ,ప్రత్యేక ఆహ్వానితులు జూలకంటి సుబ్బారావు, చింతామణి పాండు, పాలమంగళం నీలా, శ్రీదేవి, శోభ, మీనాక్షి. దేవస్థానం అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ, కృష్ణారెడ్డి, లోకేష్ రెడ్డి, ఈఈ నూకరత్నం, డిఈ శ్రీనివాసులు రెడ్డి సూపర్డెంట్ శ్రీహరి, విజయ సారథి,పారిశుధ్యం ఇంచార్జ్ రఘునాథ్ రెడ్డి, ఏఈలు రాజేశ్వరి, వేణుగోపాల్ రెడ్డి, శోభారాణి, ఎలక్ట్రికల్ ఏఈ మురళీధర్, వర్క్ ఇన్స్పెక్టర్, సూర్య ప్రసాద్, మరియు దేవస్థాన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, మరియు దేవస్థాన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment