శ్రీ కాలభైరవుని ఆలయ మహా కుంభాభిషేకం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, June 26, 2023

శ్రీ కాలభైరవుని ఆలయ మహా కుంభాభిషేకం

 శ్రీకాళహస్తి క్షేత్రంలోని కైలాసగిరి కొండల్లో వెలిసి ఉన్న శ్రీ కాలభైరవుని ఆలయ మహా కుంభాభిషేకం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయ మహా కుంభాభిషేకాలు వేదొ యుక్తంగా జరిపారు.

 క్షేత్రంలోని అనుబంధ ఆలయాలన్నిటినీకి కుంబాభిషేకాలు చేసి మహర్దశ కల్పించనున్నట్లు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు. 






స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయాలైన పురాణ ప్రసిద్ధమైన ఆలయాలకు నిలయమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో కైలాసగిరి కొండల్లో వెలిసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయ మహాకుంభాభిషేకం శాస్త్ర యుక్తంగా చేపట్టారు. ఆలయ మహా కుంభాభిషేకం జరిపి 12 ఏళ్ల పైగా కావడంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ధర్మకర్త ల మండలి లో తీర్మానం చేసి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి  సహకారంతో ఆలయ ఆధునీకరణ జీర్ణోదరణ పనులను చేపట్టారు. శ్రీ కాలభైరవ స్వామి మరియు శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాలకి ,సుమారు 40 లక్షలు వెచ్చించి ఆలయలు ఆధునీకరణ  పనులు నిర్వహించారు. ఆదివారం ఆలయ మహా కుంభాభిషేకం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు జరిపి, హోమ పూజలు శాస్త్ర యుక్తంగా జరిపారు. అనంతరం ప్రధాన కలశ జలాలను తీసుకువెళ్లి ఆలయ శిఖర కలశానికి అభిషేకాలు వేద మంత్రోచ్ఛరణలు నడుమ నిర్వహించారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామి కి ప్రధాన కలశ జలాలతో విశేష అభిషేకాలు జరిపారు. స్వామి వారికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి, దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ  హారతులు సమర్పించారు. 

శ్రీకాళహస్తి ఆలయ గాలిగోపురం సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ మహా కుంభాభిషేకం శాస్త్ర యుక్తంగా జరిపారు. ఆలయ శిఖర కలశానికి, స్వామి అమ్మవార్లకు కలశ జలాలతో విశేష అభిషేక పూజలు శాస్త్ర యుక్తంగా నిర్వహించారు.

మహా కుంభాభిషేక పూజల లో  ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ క్షేత్రంలో వెలిసిన అనుబంధ ఆలయాలు అన్నింటికీ మహా కుంభాభిషేకాలు నిర్వహించి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అనుబంధ ఆలయాలను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు,ఆలయ ఎజిక్యూటివ్ ఇంజనీర్ నూక రత్నం, పాలకమండి సభ్యులు బుల్లెట్ జై శ్యామ్, కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, డి ఈ శ్రీనివాసులు, సూపర్డెంట్ శ్రీహరి,  ఏ ఈ పవన్ కుమార్, దేవస్థాన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, అభిషేక గురుకుల్, నిరంజన్ గురుకుల్, వేద పండితులు అర్ధగిరి, పరిచారకులు గోవింద శర్మ, రాకేష్ శర్మ, మోహన్ శర్మ, అప్పాజీ శర్మ, మరియు దేవస్థాన సిబ్బంది సుదర్శన్ రెడ్డి, పసుపులేటి కామేశ్వరరావు, యోగి, మరియు పట్టణ ప్రముఖులు, లక్ష్మీపతి, పాలమంగ రవి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad