బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ విశ్వనాథ్
ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా మరియు బాల కార్మిక నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ మరియు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి పి ఎస్ జెడ్పి బాయ్స్ స్కూల్ నందు బాల కార్మిక నిర్మూలన చట్టంపై ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది మీర్జావలి, శ్రీకాళహస్ అసిస్టెంట్ లేబర్ అధికారి రంగనాథం,మరియు లేబర్ శాఖ సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు మరియు కోర్టు సిబ్బంది, పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
లేబర్ శాఖ అధికారులు మాట్లాడుతూ.... పిల్లలకై పని భారం వద్దు ! బాల్య వివాహాలను అరికడదాం ! “పిల్లలందరూ పనిలో కాదు - బడిలో ఉండాలి” అనే నినాదంపై అందరూ కలిసి “పనిచేస్తే ప్రస్తుతం మన ముందున్న పెద్ద సమస్య అయిన “బాలకార్మిక వ్యవస్థ” ను నిర్మూలించడం సాధ్యమవుతుంది. అప్పడు పిల్లలు వారి బాల్యపు హక్కు ను ఆదనంగా గడుపుతారు.
కావున బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం బాలల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం ఇది సమాజం ప్రభుత్వ సంస్థ బాధ్యత అని తెలిపారు. 1986 బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 వయసు లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదు అనేసి చట్టం చెబుతున్నది. అలాగే చిన్న పిల్లలు తప్పక బడికి పంపించాలని, పనులకు పెట్టుకున్న వాళ్ల యాజమాన్లకు కఠిన శిక్ష ఉంటుందని తెలిపారు
No comments:
Post a Comment