శ్రీకాళహస్తి దేవస్థానంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 7, 2023

శ్రీకాళహస్తి దేవస్థానంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమ

 శ్రీకాళహస్తి  దేవస్థానంలో శ్రీకాళహస్తి  దేవస్థానంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి అంజి వినాయక స్వామి  వద్ద ప్రత్యేక హోమ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు




స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :



శ్రీకాళహస్తి  దేవస్థానంలో -సంకట చతుర్దశిని పురస్కరించుకొని అంజి అంజి వినాయక స్వామి  వద్ద గణపతి హోమ పూజలు శాస్త్ర యుక్తం గా నిర్వహించారు. ప్రతి కుటుంబం గణపతి హోమం నిర్వహించుకునే విధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఆధ్వర్యంలో సంకట చతుర్దశి నాడు గణపతి హోమం ఆర్జిత సేవగా తీసుకొచ్చారు. ప్రతి సంకట చతుర్దశి నాడు అంజి అంజి వినాయక స్వామి  వద్ద అనేకమంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలిగే విధంగా ఆర్జిత సేవలో పాల్గొంటున్నారు గురువారం సంకట చతుర్దశిని పురస్కరించుకొని ఆలయంలోని అంజి అంజి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.  ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి, గణపతి హోమాన్ని శాస్త్ర యుక్తం గా నిర్వహించారు.  అనంతరం గణపతి అభిషేకాన్ని నిర్వహించి,  స్వామివారికి విశిష్ట అలంకారం చేశారు. ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు.  ఈ గణపతి హోమ పూజాది  కార్యక్రమాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు  వేద పండితులు శ్రీవత్సవ, అర్చకులు అనిల్ శర్మ, పరిచారకులు రాకేష్ శర్మ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు శ్రీదేవి ఆలయ అధికారులు పట్టణ ప్రముఖులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు


No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad