శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రికలును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అందజేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ దేవస్థానం ఈఓ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగు సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, మహాశివరాత్రి బహ్మొత్సవ ఆహ్వాన పత్రిక ను శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సమక్షంలో దేవస్థాన శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె వి సాగర్ బాబు మర్యాద పూర్వకంగా అందజేయడం జరిగినది మరియు దేవస్థాన వైదిక సిబ్బంది వారిచే శ్రీ స్వామి అమ్మ వార్ల శేష వస్త్రములను మరియు తీర్థప్రసాదాలను, ఆశీర్వచనములను అందించడం జరిగినది.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి వారితో శ్రీకాళహస్తి నందలి శివం టు శివం రోడ్డును త్వరితగతిన పూర్తి చేసే విధంగా సహాయం చేయాలని అభ్యర్థన చేయగా , శ్రీయుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే వారి వ్యక్తిగత సహాయకులను పిలిచి త్వరితగతిన సదరు పని పూర్తి చేయాలని ఆదేశించారు. దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసరావు ముఖ్యమంత్రి గారితో అభ్యర్థన చేస్తూ ఈ ప్రభుత్వ హయాంలో సుమారు 14 ఆలయాల కుంభాభిషేకాలు జరుగుతున్నాయని అయితే శ్రీకాళహస్తి దేవస్థాన మాస్టర్ ప్లాన్ ముందుకు సాగలేదని అందుకు త్వరితగతిన చర్యలు చేపట్టే విధంగా సహాయం చేయాలని అభ్యర్థన చేయగా ముఖ్యమంత్రి వెంటనే సదరు వ్యక్తిగత సహాయకులను పిలిచి సదరు పని కూడా చేయు లాగన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు వారికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థాన చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ కార్యవాహన అధికారి కె.వి. సాగర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పై తెలిపిన వారితో పాటు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు నూలి జయశ్యాం మరియు దేవస్థాన పురోహితులు ఏవివిఎస్డివి ప్రసాద్ శర్మ (అర్తగిరి) , స్థానిక వైసీపీ నాయకులు నరసింహులు (నంద) , కంథా ఉదయ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment