స్థానిక నల్ల గంగమ్మ ఆలయ ప్రాంగణంలో రాష్ట్రీయ సేవాసమితి (రాస్) మరియు టాటా ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
బహదూరపేట నల్ల గంగమ్మ ఆలయ ఆవరణలో రాష్ట్రీయ సేవా సమితి పొదుపు (రాస్ ) సంఘాల సభ్యుల సౌకర్యార్థం టాటా ట్రస్ట్ వారిచే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఆలయ కమిటీ చైర్మన్ కంఠ రమేష్,యూనియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ కిషోర్, రీజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శుభం గార్లచే ప్రారంభించడం జరిగింది. కంఠ రమేష్ మాట్లాడుతూ రాస్ సంస్థ టాటా ట్రస్ట్ వారి సహకారంతో శ్రీకాళహస్తి మరియు పరిసర ప్రాంతంలో ని మహిళలకు ఉచితంగా వైద్యసేవలను అందిస్తూ, వారి యొక్క ఆరోగ్యం పై అవగాహన కల్పించడం అభినందనీయమని తెలియజేసారు.
ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న 157 మంది మహిళలు మరియు పురుషులకు నోటి క్యాన్సర్ ,రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్, బిపి , హెపటైటిస్, షుగర్ లకు సంబంధించిన పరీక్షలు చేయడం , డాక్టర్ల బృందంచే ముందుస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది , ఈ కార్యక్రమం నందు పూల కృష్ణ మూర్తి మరియు ఆలయ కమిటీ సభ్యులు, టాటా ట్రస్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ హేమంత్,రెడ్డి కుమారి, డాక్టర్ భార్గవ్,చైతన్య, మెహతాజ్,మధుసూదన్,రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ ,ఫీల్డ్ అధికారి సుబ్బారావు, మురళీకృష్ణ ,వెంకట్,అనిమేటర్లు హిమ బిందు,జ్యోష్ణ, గౌతమీ, నాగలక్ష్మి ,జయలలిత, జయంతి, రాజేశ్వరి,రాజశేఖర్ క్లస్టర్ లీడర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.
No comments:
Post a Comment