‘యువగళం’ విజయవంతం చేద్దాం: బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, February 15, 2023

‘యువగళం’ విజయవంతం చేద్దాం: బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

 రాష్ట్ర భవిష్యత్తు కోసమే ‘యువగళం’

17నుంచి శ్రీకాళహస్తిలో నారా లోకేష్ పాదయాత్ర

వేలాదిగా తరలిరండి‘యువగళం’ విజయవంతం చేద్దాం: బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి






    స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

                    శ్రీకాళహస్తి నియోజవర్గంలో ఈ నెల 17 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజ్పప్తి చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 17వ తేదీ శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో నారా లోకేష్ పాదయాత్ర తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం వద్దకు పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. అక్కడ నుంచి కొత్తకండ్రిగ, శివనాథపురం, రాజీవ్ నగర్ మీదుగా రామచంద్రాపురం చేరుకుంటుదన్నారు. రామచంద్రాపురం వద్ద రైతులతో సమావేశం నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అక్కడ నుంచి బంగారమ్మకాలనీ మీదుగా పురపాలక సంఘం కార్యాలయం, వీఎంసీ కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని... ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారన్నారు. ఆ తరువాత పట్టణంలో పాదయాత్ర ఉంటుందన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చేస్తున్నట్లు ఆ పార్టీ నేత, మాజీ శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర యాదవ్ చెప్పారు. ఈ నెల 17 నుంచి ఐదు రోజుల పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర జరుగనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన


బీద రవిచంద్రయాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ ఆర్థికంగా దివిళా తీసిందన్నారు. ఈ నెల 12వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో పింఛను సొమ్ము ఇవ్వక పోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ఏపీలో మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి పాదయాత్రలు కొత్తవి కాదన్నారు. నారా చంద్రబాబునాయుడు ప్రజల కోసం ‘మీ కోసం’ పాదయాత్ర చేశారన్నారు. అంతకు మునుపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చైతన్య రథయాత్ర చేశారన్నారు. ప్రస్తుతం నేటి తరం కోసం తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఈ యాత్రను భగ్నం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎన్నో కుట్రలు చేస్తున్నారన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల కష్టాలు తెలుసుకుని... వారితో మాట్లాడటానికి అవకాశం లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోందన్నారు. ప్రజలతో మాట్లాడనివ్వకుండా అనేక అడ్డుంకులు సృష్టిస్తున్నారని బీద రవిచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మైకులో మాట్లాడకుండా అది లాగేస్తున్నారని... స్టూలు ఎక్కితే అది కూడా పోలీసులు లాగేయడానికి ప్రయత్నించారని ఆయన చెప్పారు. జగన్ నియంత పాలనలో భావ ప్రకటన కూడా హరించి వేస్తున్నారని ఆయన విమర్శించారు. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్, వారి కుటుంబ సభ్యులు పాదయాత్రలు చేశారన్నారు. అయితే ఆ నాడు వారికి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. పటిష్టమైన బందోబస్తు పెట్టి వారి పాదయాత్ర సవ్యంగా జరగడానికి సహకరించారన్నారు. అయితే నేడు జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కుప్పంలో గత నెల 27న ప్రారంభమైన యువగళం పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. మట్టి రోడ్లపై కూడా సమావేశాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఆదేశాలతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని బీద రవిచంద్ర యాదవ్ అభిప్రాయ పడ్డారు. యువగళం పాదయాత్ర విషయంలో పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తెలుగేశం పార్టీ జెండా పట్టుకున్న కేసులు పెడుతూ వేధిస్తున్నారన్నారు. జగన్ నిరంకుశ పాలనకు ఇదే ఒక తార్కాణమన్నారు. పొలీసులు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు సహనం పాటించి యువగళం పాదయాత్ర జయప్రదం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు. అంతకు మునుపు రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ... ప్రజా సంరక్షణ కోసం, రాష్ట్రంలో పాలన గాడిన పెట్టడానికి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారన్నారు. నారా లోకేష్, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చిన్న నాటి మిత్రులన్నారు. నారా లోకేష్ కు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గుండె లాంటి వాడన్నారు. ఇంత మంచి మిత్రుని నియోజకవర్గంలో జరిగే పాదయాత్రను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక జగన్ పాలనపై అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. జగన్ ది నియంత పాలన అని చెప్పారు. నవరత్నాలు ఒక బూటకం అన్నారు. జగన్ తీరుతో రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో వైసీపీకి వణుకు పుట్టిందన్నారు. అందుకే అడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.  ఈ అడ్డంకులను అధిగమించి అందరం ఐకమత్యంగా ‘యువగళం’ విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కలసి కట్టుగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం


శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యు సత్రవాడ మునిరామయ్య మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత అన్నారు. ఆయనకు, తనకు మధ్య మంచి సంబధం ఉందన్నారు. తమది విడదీయరాని అనుబంధం అన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు. రాజకీయాల్లో హుందాతనం అవసరం అన్నారు. తమ రాజకీయాలు వేరు... ఇప్పటి రాజకీయాలు వేరు అని ఆయన చెప్పారు. శ్రీకాళహస్తిలో 'ఎమ్మెల్యే 'అనే పదవి అత్యంత పవిత్రమైనదని అన్నారు. ముక్కంటి క్షేత్రంలో అహం పనికిరాదన్నారు. తండ్రి పాత్ర పోషిస్తూ... శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. 2024 ఎన్నికల్లో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యే చేయడం తన లక్ష్యమన్నారు. వైసీపీ అక్రమ మార్గంలో గెలవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. వాటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.  బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం తన సర్వ శక్తులు ధార పోస్తానని ఆయన చెప్పారు. రానున్నది రామరాజ్యం అన్నారు. ఇక టీడీపీ యువనేత సత్రవాడ ప్రవీణ్ మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  తమ కుటుంబంపై చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. గత మంగళవారం రోజు చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరడం... అదే మంగళవారం నాడు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తొలిసారి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ వారు తనను కుటుంబ సభ్యునిగా భావించి ఆదరించాలని కోరారు. తాను కూడా ఒక సాధారణ కార్యకర్తగా... సోదర సమానులైన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. అందరం కలిసి కట్టుగా సమన్వయంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో టీడీపీ జెండా ఎగురువేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  తెలుగుదేశం పార్టీ నేతలు దామాచర్ల సత్య, గాలి చలపతినాయుడు, గుమ్మడిపూడి దశరథాచారి, రెడ్డివారి గురవారెడ్డి, విజయకుమార్, ధనుంజయులునాయుడు, బాలాజీ నాయుడు, మురళి నాయుడు, చంద్రారెడ్డి, చెంచయ్య నాయుడు, మునిరజా నాయుడు, మిన్నల్ రవి,తాటిపర్తి రవీంద్రనాథరెడ్డి మరియు మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad