మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శ్రీ భక్తకన్నప్ప ధ్వజారోహణం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అంగరంగ వైభవంగా భక్తకన్నప్ప ధ్వజారోహణం జరిగింది.మొదటి పూజను భోళాశంకరుడు తనను మూఢభక్తితో ఆరాధించి తన కళ్ళను సైతం ఇవ్వటానికి సిద్ధపడ్డ భక్తుడు కన్నప్పకు అవకాశం కల్పించి భక్తుల పట్ల తనకు గల గుర్తింపుకు నిదర్శనంగా నిలిచారు. సోమవారం మధ్యాహ్నం ఆలయంలో భక్తకన్నప్పను మేళ తాళాలు మంగళవాయిద్యాలతో మోసుకుంటూ కొండపైకి వెళ్ళారు. భక్తకన్చప్ప గుడి వద్ధ ప్రతిష్టించి ఆలయ (ప్రధానార్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. వేదపండితులు నాలుగువేదాల్ని పఠిస్తుండగా ఆలయ ప్రధానార్చకులు పూజలు జరిపారు. ధ్వజస్థంభంపై దేవస్థానం సమర్పించిన ధవళపతాకం, పూలమాలను ఎగు రవేసి ధ్వజారోహణ నిర్వహించారు. బ్రహ్మోత్స వాలకు "శ్రీకారం చుట్టారు. అనంతరం హారతులు ఆఖండ హారతులిచ్చారు. నైవేద్యం సమర్పించారు.
ఈ కార్యక్రమాలకు విశేష సంఖ్యలో పట్టణానికి చెందిన వేలాది భక్తులు హాజరయ్యారు. ఆలయ కార్యనిర్వహాణాధికారి వికె సాగర్‌బాబు, డిప్యూటీ ఇఓ ఎన్‌ఆర్ కృష్ణారెడ్డి ఇఇ మురళీధర్‌రెడ్డి, ముక్కంటి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొన్నారు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రమ్మోత్స వాలు సందర్భంగా మొదటి పూజలు అందుకున్న భక్తకన్నప్పపట్టణంలో ఊరేగింపు జరిపారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల వేద ఘోషతో ఊరేగింపు , నాలుగు మాడ వీధుల గుండా సాగింది.
No comments:
Post a Comment