దాతుల నిండు మనసుతో చేస్తున్న దాతృత్వం ఎనలేనిది : దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరునికి యాక్ట్ ఛానల్ సీఈవో మల్లాడి బాలసుబ్రమణ్యం దంపతులు, మల్లాడి నాగేశ్వరరావు దంపతులు భక్తి ప్రభక్తులతో కోటి 36 లక్షల విలువచేసే వెండి అంబారీలను వితరణగా అందజేశారు. దేవస్థానం చైర్మన్ అంజూ రు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు సమక్షంలో వెండి అంబారీ ల కు పూజాది కార్యక్రమాలు నిర్వహించి, దాతలు దేవస్థానానికి అప్పగించారు. దాతల నిండు మనసుతో చేస్తున్న దాతృత్వం ఎనలేనిది అని దేవస్థానం చైర్మన్ అంజూ రు తారక శ్రీనివాసులు అన్నారు.
శ్రీకాళహస్తీశ్వరునిపై అత్యంత భక్తి ప్రభక్తులతో యాక్ట్ ఛానల్ సీఈవో మల్లాడి బాలసుబ్రమణ్యం భారీ విరాళం గా వెండి అంబారీలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న యాక్ట్ సీఈవో మల్లాడి బాలసుబ్రమణ్యం ను శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వామి అమ్మవార్ల ఉత్సవ నిర్వహణకు ప్రధానమైన అంబారి ల ను చేయించి ఇవ్వాలని కోరారు. వెనువెంటనే స్పందించిన దాత యాక్ట్ ఛానల్ సీఈవో మల్లాడి సుబ్రమణ్యం ఆ సర్వేశ్వరుని సేవ చేసుకునే భాగ్యం పూర్వజన్మ సుకృతం అని భావించి వెంటనే ఆమోదం తెలిపి, వెండితో అంబారీ చేయించి ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కోటి 36 లక్షల రూపాయలు వెచ్చించి రెండు వెండి అంబారీ ల ను చేయించి దేవస్థానానికి అప్పగించారు.
సోమవారం శ్రీకాళహస్తి ఆలయంలోని 16 కాళ్ల మండపం వద్ద వెండి అంబారీలకు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సారథ్యంలో ఆలయ అభిషేక గురుకుల్ రాజేష్ గురుకుల్ వేద పండితులు విశేష పూజలు జరిపారు.
అనంతరం వెండి అంబారీల దాతలు మల్లాడి బాలసుబ్రమణ్యం దంపతులు, వారి సోదరులు మల్లాడి నాగేశ్వరరావు దంపతులు వెండి అంబారీలను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు సమక్షంలో దేవస్థానానికి సంప్రదాయ పద్ధతిలో వేదో యుక్తంగా సమర్పించారు. దాతలను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈవో సాగరబాబులు అభినందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.. వేద పండితులు దాతలను ఆశీర్వచనం చేశారు..
చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దాతలకు స్వామి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు.
దాత యాక్ట్ ఛానల్ సి ఈ ఓ మల్లాడి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ దేవుడిపై భక్తి ప్రభక్తులు తో ఓ చిన్న కానుక అందించే ప్రయత్నం చేశామని, దేవస్థానం చైర్మన్ అంజూ రు శ్రీనివాసులు, అధికారులు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేమన్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ యాక్ట్ ఛానల్ సీఈవో మల్లాడి బాలసుబ్రమణ్యం అడిగిన తడువే ముందుకు వచ్చి భారీ విరాళం అందించడం అభినందనీయం అన్నారు. వారికి శ్రీకాళహస్తిశ్వరుని పై భక్తి ప్రభక్తులకు నిదర్శనం అన్నారు. నిండు మనసుతో దాతలు ముందుకు వచ్చి చేస్తున్న దాతృత్వం ఎనలేనిది కొనియాడారు. వారికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని సంపూర్ణ కృపాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, యాక్ట్ ఛానల్ ఏ పి ఆపరేషన్స్ హెడ్ బి వి సుబ్బారావు, ధర్మకర్తల మండలి సభ్యులు సాధనమున్న, నందా నరసింహులు, భాస్కర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment