RUSH హాస్పిటల్ అధినేత Dr. సిపాయి సుబ్రమణ్యం గారికి జనసేన పార్టీ ఆహ్వానం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
RUSH హాస్పిటల్ అధినేత , 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన Dr. సిపాయి సుబ్రమణ్యం గారిని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ఈరోజు తిరుపతిలోని తన కార్యాలయంలో కలిసి జనసేన పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.
సిపాయి సుబ్రమణ్యం గారు నిన్న తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నిన్నటి రోజు పార్టీ లో తగిన ప్రాధాన్యత లభించలేదని, ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం నుండి ఆయన్ని ఆదరించిన అనుచరులకు, నమ్మి వెంట నడిచిన వారికి న్యాయం చెయ్యలేక పోయానని అసంతృప్తితో రాజీనామా చేశానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమి ఆశించకుండా తనని గుర్తించి, గౌరవించి తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అని తెలిపారు. తన సంపూర్ణ
మద్దతు జనసేన పార్టీ కి ఉంటుందని , 30 సం. లు గా వినుత గారి కుటుంబంతో అనుభందం ఉన్నందున వినుత గారికి పూర్తి మద్దతు, ఆశీస్సులు ఉంటుందని తెలిపారు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులను వినుత గారికి పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment