శ్రీకాళహస్తి స్వామి అమ్మవారి ధ్వజ రోహణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కైలాసం లో పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజ రోహణ నిర్వహించారు స్వామి అమ్మవారిని వెండి అంబారి వాహనాలు మీద కొలువ తీర్చి కలస్థాపన గణపతి పూజ పుణ్య వచనము వరుణ పూజ కలశానికి పుష్పాలతో పూజలు చేసి కంకణ దారుణ హోమగుండంలో హోమము వేసి పూర్ణాహుతి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణ సాంప్రదాయబద్ధంగా చేశారు ఆపై వేద పండితులతో వేద పారాయణం మంత్రపుష్పం పట్టించి దీప దూప నైవేద్యం అఖండ దీపారాధన కుంభహారతి స్వామి అమ్మవారికి నీరాజనం కర్పూర హారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు, ఆలయ కార్యనిర్మాణ అధికారి కె.వి.సాగర్ బాబు దంపతులు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీ వాణిరెడ్డి, బియ్యపు పవిత్ర రెడ్డి శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు మరియు పాలకమండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు మరియు ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి ధ్వజారోహణ సందర్భంగా భక్తులు సమర్పించిన కోడి వస్త్రాలు (చీరలు)3984 వస్త్రాలు భక్తులు సమర్పించారు. గత సంవత్సరం సమర్పించిన వస్త్రాలు3196


.jpeg)

.jpeg)



.jpeg)










.jpeg)







No comments:
Post a Comment