హంస -యాలి * మూడవ తిరునాళ్ళు*
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడవరోజు హంస వాహనం పై శ్రీకాళహస్తీశ్వర స్వామి యాలి వాహనంపైశ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మ వారు అధిరోహించి కర్పూర హారతులు సమర్పించారు.అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశ్శివాయ నామస్మరణ ల మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వాహక అధికారి కె.వి.సాగర్ బాబుమరియు పాలకమండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment