బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక మరియు బాలలను వెట్టి చాకిరి వ్యవస్థలను రూపు మాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
హైకోర్టు మరియు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాల నిర్మూలన, బాల కార్మిక నిర్మూలన మరియు వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి వివిధ శాఖల కలయికలతో వెట్టి చాకిరి నిర్మూలన వారం రోజుల కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని లోబావిలో భరద్వాజ ఎస్టీ కాలనీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది.... మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ.... బాల్యవివాహాల నిర్మూలన,
బాల కార్మిక, వెట్టి చాకిరి వ్యవస్థలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మైనర్ పిల్లల కోసం పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహం నిర్మూలన,
బాలల కార్మిక, వెట్టి చాకిరి వ్యవస్థలను రూపు మాపాలని, చైల్డ్ మ్యారేజ్, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లల కోసం ఏమి అవసరమైనా తాము ముందుంటామని లీగల్ సర్వీస్,పోలీస్ శాఖ ఉంటామని అన్నారు.
No comments:
Post a Comment