బాల కార్మిక మరియు బాలలను వెట్టి చాకిరి వ్యవస్థలను రూపు మాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన న్యాయవాదులు, వివిధ శాఖల ఉన్నతాధికారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
హైకోర్టు మరియు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక నిర్మూలన మరియు వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి వివిధ శాఖల కలయికలతో వెట్టి చాకిరి నిర్మూలన వారం రోజుల కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతంలోని తొండమనాడు గ్రామ పరిధిలో ఇసుక బట్టీలలో బాల కార్మికుల ఉన్నారో, లేరో అని పరిశీలించారు. అనంతరం అక్కడ పని చేసే కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రంగనాథ్, కోర్టు సిబ్బంది.... మొదలైన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లేబర్ అధికారి రంగనాథ్ మాట్లాడుతూ....
బాల కార్మిక, వెట్టి చాకిరి వ్యవస్థలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మైనర్ పిల్లల కోసం పనిచేసే అన్ని డిపార్ట్‌మెంట్స్ కొవిడ్ సమయంలో చాలా బాగా పని చేశాయన్నారు.
బాలల కార్మిక, వెట్టి చాకిరి వ్యవస్థలను రూపు మాపాలని, చైల్డ్ మ్యారేజ్, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లల కోసం ఏమి అవసరమైనా తాము ముందుంటామని లీగల్ సర్వీస్,పోలీస్ శాఖ ఉంటామని అన్నారు.
No comments:
Post a Comment