శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవికి హైదరాబాద్ వాస్తవ్యులు 24 గ్రాముల 500 మిల్లీలు రాళ్లతో కూడిన బంగారు తాళిబొట్టునీ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ కు అందజేశారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానముకు మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు నేలటూరి గోపీనాథ్ రెడ్డి గారు శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవికి 24 గ్రాముల 500 మిల్లీలు రాళ్లతో కూడిన బంగారు తాళిబొట్టునీ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో బంగారు తాళిబొట్టునీ అందించిన దాతలను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అభినందించి, స్వామి అమ్మవార్ల కృప తో ఆ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేవస్థానం చైర్మన్ దాతలను శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్, దేవస్థాన సూపర్డెంట్ కళ్యాణి, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి మరియు పాలక మండల సభ్యులు, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment