శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తకన్నప్ప ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘబహుళ నవమిని పురస్కరించుకుని ధ్వజారోహణం జరుగనుంది. ఆలయంలో స్వామి వారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తం భం వద్ద ఈ మేరకు ధ్వజా రోహణ పూజలు ప్రారంభం కానున్నాయి. ఇక తొలిగా భక్తకన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. సాయంత్రం కైలాసగిరుల్లోని భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణంతో బ్ర హ్మో త్సవాలకు అంకురార్పణ జరిగింది. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారథ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దిగివచ్చి దీవించా లంటూ దేవతలను అర్చకులు శాస్త్రో క్తంగా ఆహ్వానించారు. భక్తుడైన భక్తకన్నప్ప ఉత్సవాల్లో ప్ర«థమ పూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. సాయంత్రం ధ్వజారోహణ పూజలు ప్రారంభమయ్యాయి. గంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు.తొలుత ఆలయం నుంచి శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్త కన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ఊరేగింపుగా కైలాసగిరి కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయానికి వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.∙వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా దర్భతో తయారు చేసిన పవిత్ర దారాన్ని, వస్త్రాన్ని «ధ్వజస్తంభాని కి ఆరోహింపజేశారు. దీప,ధూçప, నైవే ద్యాలు సమర్పించారు. దీంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూర్తయింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు, మేళతాళాలు నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమ ర్పించారు. ఈ కార్యక్రమంలో బియ్యపు పవిత్ర రెడ్డి, ఆలయ ఈఓ ఎస్ వి నాగేశ్వరరావు,డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున, ఏఈఓ ధనపాల్ ,టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుదర్శన్ నాయుడు,ఆలయ అధికారులు,తదితరులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు, పాల్గొన్నారు,
No comments:
Post a Comment