స్వామి వారు అధికార నందివాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు కామదేనువాహనం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు ఉదయం స్వామి వారు అధికార నందివాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు కామదేనువాహనంలో పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.ముందుగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్లకు సుగంధద్రవ్యాలతో అభిషేకాలు చేసి తదుపరి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా స్వర్ణ అభరణలతో అలంకరించి , పూజలు చేసి చేశారు.స్వామి అమ్మవార్లకు రక్ష తిలకం దిద్ది తదుపరి స్వామి వారు అధికారనందివాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని కామదేను వాహనంలో కొలువు తీర్చి నాలుగు మాడ వీధులలో భక్తులకు ఊరేగించారు. అశేష భక్తజనం స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొన్నారు. అడుగడుగున స్వామి అమ్మ వాళ్లకు హారతులు పట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు ఆలయకార్యనిర్వహణాధికారి ఎస్వీ నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయు డు,మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment