శ్రీకాళహస్తీశ్వరునీ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంబారీ సేవ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరునీ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారము,రాత్రి అంబారీ సేవ నిర్వహించారు. ఆలయంలో స్వామి వారి ధ్వజారోహణం అనంతరం యాగశాలలో అనువంశిక ప్రధాన గురుకుల్ స్వామినాథ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు జరిపారు. అనంతరం అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి, వెండి అంబారీల్లో కొలువు తీర్చి గ్రామోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు కోలాటాలు శంఖారావం డమరుకం నడుమ స్వామి అమ్మవార్లతోపాటు వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి చండీకేశ్వరుని ఉత్సవమూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఆకర్షణీయమైన విద్యుత్ దీప కాంతుల్లో నూతన వెండి అంబారీల్లో విశేష దివ్య తేజస్సు అలంకారంలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు దర్శించుకుంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు డిప్యూటీవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఈశ్వర్ హరి యాదవ్, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్,అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment