స్వామి అమ్మవార్లు రాత్రి ఉత్సవం మూడవ తిరునాలు రావణాసుర మయూర వాహన సేవలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు లో భాగంగా రాత్రి శ్రీకాళహస్తిలో రావణ ,మయూర వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చి స్వామివారిని రావణ వాహనంపై అమ్మవారిని మయూర వాహనం వాహనంపై కొలువుదీర్చి విశేష హారతులు ఇచ్చారు. అనంతరం పంచ మూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. పరమేశ్వరునికి విశిష్ట భక్తుడైన దశకంఠుని వాహనంగా చేసుకొని జగత్ రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వడంలో ఆంతర్యం అత్యంత భక్తి తత్వంతో పూజిస్తే తనలో ఐక్యం చేసుకుంటానని రావణ వాహన సేవ భక్తులకు తెలియజేస్తుంది. లంకేశ్వరుడు పై
దర్శనమిస్తున్న పరమేశ్వరుని దర్శిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందం తో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, శివమాల దారుల పంచాక్షరీ జపం, భక్తుల శంఖం పూరించి, డమరుకం మోగిస్తూ, కోలాట భజనలు డప్పులు, మంగళ వాయిద్యాలు నడుమ రావణ మయుర వాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. ఈ వాహన సేవ లో శ్రీకాళహస్తి ఆలయ ఈవో, ఎస్వీ నాగేశ్వరరావు, డిప్యూటీవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపరేచర్ హరియాదవ్, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ,సతీష్,మాలిక్,అంజూరు శ్రీనివాసులు, ఆల ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment