హంస-చిలుక వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నగరోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లోగురువారం,ఉదయం హంస ,చిలుక, వాహన సేవ చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి వారిని హంస వాహనంపై, అమ్మవారిని చిలుకవాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో భక్తుల శివ నామస్మరణలు చేస్తూ డమకరాలు మోగిస్తూ శంఖారావాలు పట్టిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి, హరహర మహాదేవ్ అంటూ ప్రణమిల్లారు. హంస ఏ విధంగా పాలు నీరును వేరు చేస్తుందో, అదే విధంగా భక్తులలో చెడు గుణాలను తొలగించి మోక్షమార్గంలో సాగేలా చేస్తారని, హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి.
No comments:
Post a Comment