మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాదేవుని పూజలు అంటే అనేక ఆగమ శాస్త్ర నిబంధనలు.
విశిష్ట శక్తి స్వరూపుని వద్ద శక్తి స్వరూపిణి ల కు విశేష పూజలు జరపడం గమనార్హం. శ్రీకాళహస్తి ఆలయం అద్దాల మండపం వద్ద వెలసివున్న శక్తిస్వరూపిణి లు సప్తమాతృకల కు విశేష అలంకారాలు చేసి అంకురార్పణ పూజాది కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు చేసి పుట్ట మట్టి నీ పెట్టి విశేష పూజాది కార్యక్రమాలు జరిపారు. పుట్ట మట్టిని ఏడు పాలికి లో ఉంచి విశేష పూజలు జరిపారు. అనంతరం యాగశాల నందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి, యాగశాలలో పుట్టమట్టి ఉంచి బ్రహ్మోత్సవాలకు శాస్త్రయుక్తంగా శ్రీకారం చుట్టారు.
ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం , A.Cమల్లికార్జున ప్రసాద్, ఏవో ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపర్డెంట్, నాగభూషణం యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment