శ్రీకాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్లను వెండి అంబారీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ధ్వజారోహణం ముందు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం శ్రీకాళహస్తి పురవీధుల్లో చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్లను వెండి అంబారీ లో ఉంచారు. పురవీధుల్లో మేళతాళాలు కోలాట భజనలు నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు వెండి అంబారీ పై స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి,ఆలయ ఈవో నాగేశ్వరరావు, ఏసీ మల్లికార్జున ప్రసాద్, డిప్యూటీవో ఏకాంబరం, టెంపుల్ ఈశ్వర్ హరి యాదవ్, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు పాల్గొన్నారు
No comments:
Post a Comment