మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్ర విమాన వాహన సేవ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన వాహన సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. పాల సముద్ర మధనంలో వెలువడిన విషాన్ని హరుడు హరించి సకల లోకాలను కాపాడిన ఆనందోత్సాహం తో ఇంద్రాది దేవతల ఆధ్వర్యంలో పరమేశ్వరుని ఇంద్ర విమానంలో ఉంచి సకల లోకాలు లో జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్ర విమానవాహక సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన సేవ ను చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చారు. స్వామివారిని విమానంలో అమ్మవారిని చాప్పరం లో ఉంచి విశేష హారతి లు సమర్పించి గ్రామోత్సవం చేపట్టారు.
మహా శివరాత్రి పర్వదినానికి అశేషంగా తరలివచ్చిన భక్తులు విమానాల్లో దర్శించుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి ,ఆలయ ఈవో ఎస్వీ నాగేశ్వరరావు, ,అంజూరు శ్రీనివాసులు ప్రముఖులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment