వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మ ఆధ్వర్యంలో మహేశ్వరునికి దేవతలు బ్రహ్మరథం పట్టి ఊరేగించే క్రమంలో భాగంగా రథోత్సవం జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి తీసుకొచ్చి స్వామివారిని బ్రహ్మరథం పై అమ్మవారిని కాళికాదేవి రథంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు జై జై ధ్వానాలు చేస్తూ రథం లాగారు. తండోపతండాలుగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రధాని లాగారు. ఆలయ ఈవో ఎస్వీ నాగేశ్వరరావు, టెస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు బోర్డు సభ్యులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 200 స్టూడెంట్స్ పాల్గొన్నారు, డిప్యూటీవో ఏకాంబరం ,ఏసి మల్లికార్జున ప్రసాద్,ఆలయ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment