కనుల పండువగా శ్రీకాళహస్తీశ్వరుని ఆదిదంపతుల కళ్యాణం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల కళ్యాణం కమనీయమైన లోక కళ్యాణకారణమైంది. జగత్కారుకులైన పార్వతీపరమేశ్వరులు వధూవరులైన అయినా వివాహ మహోత్సవంలో భక్తజనం పులకించిది . నేటి తెల్లవారుజామున సాగిన శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవంలో ముల్లోకాలు పాల్గొని అక్షింతలు చల్లి మనం నవదంపతులను ఆశీర్వదించయి . స్వామి స్వర్ణభరుడై సుందరకారుడై, చందన లేపనాది సుగoద ద్రవ్యాలు అలదుకుని నవమోహనకా రుడై , ఆలయం నుంచి గురువారం రాత్రి 10 గంటల సమయంలో కళ్యాణ వేదికకు గజ వాహనం ఎక్కి ఊరేగింపుగా బయలుదేరాడు. జ్ఞాన ప్రసూనాంబ సూర్య చంద్ర వంకలు ధరించిన మణిమయ రత్న గోమేధీకాభరణలు అలంకరించుకొని సింహవాహనమెక్కి అల్లనల్లన ఆగి ఆగి తాను కూడా అయినా పెళ్లి మండపం వద్దకు పయనమైంది కళ్యాణంవేదిక చేరుకున్న శివుడు అక్కడ కొలువయ్యాడు. ఆ వెనుకే అరుదెంచిన అమ్మవారు ఎదురెదురుగా నిలిచారు ఇరువురి పెద్దల మధ్య పెళ్లి సంబందానికి సంబంధించిన రాయబారాన్ని చండికేశ్వరుడు నడిపాడు శివుని తరపు పెద్దలు పిల్లనివ్వమంటూ అమ్మవారి పెద్దలను కోరడమూ , వారు కాదనడమూ ... ఇలా కొంత సేపు సాగింది కాస్త దూరంగా నిలిచి జ్ఞాన ప్రసూనాంబ బెట్టు చేసింది, ఐదుమార్లు చండికేశ్వరుడు రాయబారం నడిచింది. చివరకు ఏకముఖ బిల్వ పత్రాన్ని రవంత విభూదిని మాత్రం కన్యా శుల్కంగా గ్రహించి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తీశ్వరుని వివాహమాడడానికి సిద్ధమైంది. అగ్నిహోత్రం వెలిగింది. వేదఘెషలు మిన్నoటుయి . ప్రధానార్చకులు మంత్ర పట్టణం పవిత్రమై సాగింది. ప్రధాన పురోహితుడు ద్వారా అమ్మ మెడలో స్వామివారు మంగళసూత్రధారణ చేయడంతో ఆదిదంపతుల కళ్యాణ మహోత్సం ముగిసింది. తలంబ్రాలు పోసుకొన్నారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు కురిశాయి . నవనవోన్మేషమైన శివపార్వతులకళ్యాణం చూడడానికి రెండుకళ్ళూ చాలలేదు సిగ్గుల మొగ్గగా మారిన అమ్మవారు. రాజసం ఒలికీస్తు ఠీవి గా నిలిచిన స్వామి వారు.. ఏడడుగులు కలిసి నడిచారు.. ఆదిదంపతుల వెలిశారు. ఉమాపార్వతి కళ్యాణాన్ని తిలకించి సకల లోకం పులకించి పరవశించింది. ఇదే శుభముహూర్తం గా భావించిన పలు జంటలు పెళ్లిళ్లు చేసుకొని ఒకటయ్యాయి. దేవుడు పెళ్ళిరోజు బాల్య వివాహాలు జరగకుండా చేయడంలో అధికారులు అయ్యాడని సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ఈవో ఎస్ వి నాగేశ్వరరావు దంపతులు, ఆలయ చైర్మన్ మంజూరు శ్రీనివాసులు దంపతులు, విజయవాడ ఈవో రామారావు, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్స్ ఇన్స్పెక్టర్,హరి యాదవ్ టెంపుల్ సూపరిండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment