మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు స్వామి అమ్మవార్లు ఉదయం మయూర యాలి వాహనo
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శ్రీకాళహస్తిలో హంస యా లీ వాహన సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చి హంస యాలి వాహనాలపై ఉంచారు. అనంతరం పురవీధుల్లో అత్యంత వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. విశిష్టమైన హంస వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హర హర మహాదేవ శంభో శంకర అంటూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎస్ వి నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం ,ఏసి మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్,ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment