మహాశివరాత్రి రెండవ రోజున స్వామి వారిధ్వజారోహణంవిశేషోత్సవాన్ని..ఆగమోక్తంగానిర్వహించారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలనుపురస్కరించుకుని రెండవ రోజున స్వామి వారి ధ్వజారోహణంవిశేషోత్సవాన్ని..ఆగమోక్తంగానిర్వహించారు.ఆలయ అధికారులు టో పాటూ పెద్ద సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల ధ్వజారోహణ ఘట్టం సందర్భంగా ధ ర్మప్రతీక అయిన వృషభరాజాన్నిధ్వజసంకేతంగా చేసి..ఈవిశేషోత్సవంనిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. ధ్వజస్తంభానికి ఎదురుగా శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఆశీనులయ్యారు. ఇక ఒక్కో దిక్కున శ్రీవినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరుని ఉత్సవమూర్తులను ఉంచారు. ఉత్సవమూర్తుల వద్ద యాగకలశాలు, ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి కొలువుదీరిన త్రిశూలం ఉంచారు. ఆలయ వేదపండితులు, పురోహితులు ఆధ్వర్యంలో ఆలయ అనువంశీక ప్రధాన అర్చకులు స్వామినాథన్.. శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ప్రధాన మూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు కంకణధారణ మహోత్సవం జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణలతో అష్టదిక్పాలకులు, యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వాది దేవాదులు, సమస్త భేరి, ధ్వజదేవతలను ఆహ్వానించారు. కొడితాడుతో పాటు వృషభధ్వజం కల్గిన దవళవస్త్రానికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వృషభ ధ్వజసంకేతం కల్గిన దవళవస్త్రాన్ని వేదపండితుల మంత్రోచ్చారణలు, మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. కొడిముద్దలను నివేదన చేశాక ధూప, దీపోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చీరలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ విధంగా ధ్వజస్తంభం మీదకు అధిరోహించిన చీరలను తిరిగి తీసుకుంటే.. పెళ్లికాని పిల్లలకు వివాహాలు జరుగుతాయని, సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుందని, వారి సౌభాగ్యం చిరకాలం ఉంటుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది మంది మహిళలు కొడిచీరలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో , ఎమ్మెల్యే సతీమణి బియ్యపు వాణి,బియ్యపు పవిత్ర రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు, అంజూరు శ్రీనివాసులుదంపతులు పాల్గొన్నారు,
No comments:
Post a Comment