శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ప్రాకార ఉత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు.. వాహన సేవలో భాగంగా భూత రాత్రి పై శ్రీకాళహస్తీశ్వర స్వామి, శుక వాహనం పైశ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మ అధిరోహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశ్శివాయ నామస్మరణ ల మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ప్రాకార ఉత్సవం, అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి ఎస్ వి నాగేశ్వరరావు డిప్యూటీ, ఈవోఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment