మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తన నాట్యంతో అలరించిన చిన్నారి హర్షిత సూర్యకుమార్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్నంలోని ధూర్జటి కళా ప్రాంగణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మహాశివరాత్రి పర్వదినమున ఈరోజు చిన్నారి హర్షిత సూర్యకుమార్ చే భరతనాట్య నృత్య ప్రదర్శన జరిగింది. తన హావ భావాలతో భక్తులను భక్తిపార్వశంలో ముంచెత్తింది. ఓం శివ శంభో, హనుమాన్ చాలీసా, అన్నమయ్య కీర్తనలు మరియు అమ్మవారి భక్తి పాటలకు భరతనాట్యం చేసింది. అనంతరం దేవస్థానం తరఫున తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవారి ప్రతిమ బహుమతిగా అందించారు.
No comments:
Post a Comment