మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహన సేవ అత్యంత వేడుక
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంగళవారము,ఉదయం సూర్యప్రభ వాహన సేవ అత్యంత వేడుకగా నిర్వహించారు.. ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు కు విశేష అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, అమ్మవారిని చప్పరం లో ఉంచి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. పంచమూర్తుల గ్రామోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు.
No comments:
Post a Comment