మహాశివరాత్రి అత్యంత వైభవంగా నంది వాహనం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మహా శివరాత్రి సందర్భంగా నంది వాహనంపై *శ్రీకాళహస్తీశ్వర స్వామి * సింహ వాహనంపై *శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు అధిరోహించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు అనంతరం వేదమంత్రోత్సవాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ ఓం నమశ్శివాయ నామస్మరణ మధ్య శ్రీకాళహస్తి చతుర మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ కనుల పండుగగా నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని పునీతులైనారు.
ఈరోజు మహాశివరాత్రి జాగారం కావడం చేత అధిక సంఖ్యలో భక్తులు నాలుగు మాడ వీధులలో పూర్తిగా ఓం నమశ్శివాయ* నామస్వరలతో మారుమోగింది.
No comments:
Post a Comment