మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శేష యాలి,వాహన సేవ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారము,రాత్రి,శేష యాలి,వాహన సేవ అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయం అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారం చేశారు. ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారిని శేష వాహనంపై అమ్మవారిని యాలి వాహనంపై విశేష హారతులు సమర్పించారు. అనంతరం పంచ మూర్తుల గ్రామోత్సవం పురవీధుల్లో అత్యంత వేడుకగా జరిపారు. వాహన సేవ ముందు కోలాటాలు చెక్క భజనలు చేస్తూ ముందుకు సాగగా, శివమాల దారులు పంచాక్షరి పఠనం చేస్తూ శంఖారావం డమరుకం మోగిస్తూ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులు వాహన సేవలను తిలకిస్తూ పరమేశ్వరుని శేష పై తిలకించి ఆధ్యాత్మిక ఆనందం తో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు హర హర మహాదేవ అంటూ మ్రోకరిల్లారూ.
ఈ వాహన సేవలో ఆలయ ఈవో ఎస్ వి నాగేశ్వరరావు, డిప్యూటీఓ ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏవో ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, పాల్గొన్నారు.
No comments:
Post a Comment