శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కుమారుడు కొట్టు విశాల్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు విశాల్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం దర్శనానికి విచ్చేసిన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయులు బియ్యపు ఆకాశ రెడ్డి శేష వస్త్రంతోసత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు సాధనం మున్న మరియు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మరియు ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment