ప్రతిఒక్కరికి న్యాయం, న్యాయపరం గా అందాలని తెలిపిన :సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి.బేబీ రాణి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రతిఒక్కరికి న్యాయం, న్యాయపరం గా అందాలని జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్భముగా శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి.బేబీ రాణి
సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు జిల్లాకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణం లోని న్యాయస్థాన సముదాయము లో " జాతీయ న్యాయ సేవ దినోత్సవం" వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సమావేశం లో సీనియర్ సివిల్ జడ్జి బి బేబీ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనరేంద్రరెడ్డి, ఏపిపి జయ శేఖర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ప్రసాద్ , సీనియర్ న్యాయవాది ఉదయనాధ్, శ్రీకాళహస్తి సబ్ డివిజన్ ఆర్డీవో రామారావు, శ్రీకాళహస్తి డిఎస్పి విశ్వనాథ్ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబెర్ లు,బార్ అసోసిషన్ సభ్యులు, పార లీగల్ వాలంటీర్లు , కోర్టు సిబ్బంది, పాల్గొన్నారు
సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి మాట్లాడుతూ.....లీగల్ సర్వీస్ ను పేద ప్రజలకు , బలహీన వర్గాలకు చేరువగా , మహిళలకు మరియు చిన్నపిల్లలకు ఉచితముగా న్యాయ సేవలను అందించడానికి 1987 లీగల్ సర్వీస్ ఆక్ట్ ను 9 నవంబర్ 1995 సంవత్సరం అములు చేయడం జరిగినది. ఈ దినోత్సవం అందరూ జరుపుకోవాలని, అలాగే న్యాయ పరమైన సేవలపై అందరూ అవగాహన తెలుసుకోవాలని అన్నారు. న్యాయ సేవలు గ్రామస్థాయిలోకి వెళ్లి అవగాహన ఇవ్వాలని పారా లీగల్ వాలంటీర్లకు సూచించారు.
అనంతరం గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారి ఆదేశాల మేరకు న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీల తో బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ఆర్.అనంతపురం మరియు కన్నమనంబేడు గ్రామాలలో రైతులకు మరియు గ్రామ ప్రజలకు న్యాయ సేవా అవగాహన కార్యక్రమాలు జరిగింది
No comments:
Post a Comment