లింగ వివక్షత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి --- యం.ఈ.ఓ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని యం.ఆర్.సి. భవనంలో మండల స్థాయి అధికారులు తో లింగ వివక్షత పై తీసుకోవలసిన చర్యలు పై సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ భువనేశ్వరి, వై.యస్.ఆర్.క్రాంతి పథం ఏపియం మునయ్య , పారా లీగల్ వాలంటరీలు , ఐసిడియస్ సూపర్ వైజర్ బజవతి, యం.ఐ.యస్ కో-ఆర్డినేటర్ మాదవయ్య, సి.ఆర్.పి.లు మరియు మహిళలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా యంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ..... లింగ వివక్షత నిర్మూలన కొరకు అన్ని స్థాయిలలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్యా వ్యవస్థ నందు తప్పనిసరిగా ప్రతి స్కూల్ లో మగ పిల్లలుతో సమానంగా ఆడ పిల్లలు కు ప్రాధాన్యత ఇవ్వడం తో పాటు, ఎలాంటి చిన్న సమస్య ఎదురైన ప్రతి స్కూల్ లో నేరుగా చెప్పలేని పిల్లలు కొరకు కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసి తద్వారా సరైన పరిష్కారం కోసం పనిచేస్తున్నామని తెలియ చేశారు.
వై.యస్.ఆర్.క్రాంతి పథం ఏపియం మాట్లాడుతూ..... లింగ వివక్షత నిర్మూలన కొరకు ప్రతి సంఘం సమావేశం లో అజెండా పెట్టి చర్చించడమే కాకుండా ప్రతి సంఘానికి ఒకరిని, ప్రతి గ్రామ సంఘంలో & మండల సమాఖ్య లో 5 మంది చొప్పున జెండర్ కమిటీ లు ఏర్పాటు చేసి తద్వారా లింగ వివక్షత తో పాటు మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలు ఈ కమిటీ లు ద్వారా పరిష్కరించుకొనేలా చైతన్యం చేస్తున్నామని తెలియ చేశారు. .
No comments:
Post a Comment