గోశాలకు గోవు మరియు గోసంరక్షణకై పదివేలు రూపాలు విరాళం...కృతజ్ఞతలు తెలియజేసిన ఛైర్మన్ శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం దేవస్థానం అనుబంధమైన గోశాలలోని గోవు మరియు గోసంరక్షణకై నెల్లూరు జిల్ల ఇందుకూరుపేట వాస్తవ్యులు శ్రీ రమణయ్య మరియు భద్రమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం చైర్మన్ శ్రీ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గోవు మరియు గోసంరక్షణకై రూ.10,000 /-లు విరాళం అందజేసిన శ్రీకాళహస్తీశ్వర దేవాలయం లోని దక్షిణామూర్తి స్వామి వారి వద్ద చైర్మన్ గారికి వారు ఈ విరాళాన్ని అందజేసి వారి యొక్క భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి పాల్గొన్నారు. తదనంతరం వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి దాతలకు స్వామి అమ్మవార్లల దీవెనలు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈ సుబ్బారెడ్డి, మరియు గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment